Home News Vivo V29 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి!

Vivo V29 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 సిరీస్
  • నైట్ పొట్రెయిట్, స్మార్ట్ ఆరా లైట్ ఈ సిరీస్ ప్రత్యేకతలు
  • 3డీ పార్టికల్ టెక్నాలజీతో వస్తోన్న Vivo V29 లైనప్

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V29 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ లాంచ్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో వివో వీ-సిరీస్ కి క్రేజ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో, వివో సంస్థ Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

Vivo V29 సిరీస్ లాంచ్ తేదీ

వివో సంస్థ తన అధికార X ఖాతా ద్వారా Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. అక్టోబర్ 4 వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Vivo V29 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పోస్ట్ లో వివో, “ద వర్డ్ ఈజ్ ఔట్! #దమాస్టర్‌పీస్ వివో వీ29 సిరీస్ ఈజ్ లాంచింగ్ ఆన్ 04-10-2023 ఎట్ 12పీఎమ్” అని రాసుకొచ్చింది. పోస్ట్ తో పాటు ఒక వీడియో క్లిప్ ని జతచేసింది. ఈ వీడియో క్లిప్ లో Vivo V29 సిరీస్ లాంచ్ గురించి అడుగుతోన్న వివో ఫ్యాన్స్ ని గమనించవచ్చు.

Vivo V29 సిరీస్ సేల్ వివరాలు

Vivo V29 సిరీస్ ఫ్లిప్‌‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ షాప్, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా సేల్ కి వస్తుంది.

Vivo V29 సిరీస్ డిజైన్, ఇతర ఫీచర్లు

Vivo V29 సిరీస్ డివైజెస్ అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ భారతదేశపు తొలి 3డీ పార్టికల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. టీజర్ ని బట్టి, ఫోన్ బ్యాక్ ప్యానెల్ మెజెస్టిక్ షిమ్మరింగ్ లైట్స్, షాడోస్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ద్వారి ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఫోన్ స్లిమ్, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫోన్ 0.746 సె.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V29 సిరీస్ స్మార్ట్ ఆరా లైట్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా నైట్ పొట్రెయిట్స్ ని మెరుగ్గా తీయవచ్చు. అలాగే లైట్ ఇంటెన్సిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే వీలుంది. స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇండియా ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ స్టైల్ పొట్రెయిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్