Home News లాంచ్ కి ముందు Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్‌ని టీజ్ చేసిన కంపెనీ!

లాంచ్ కి ముందు Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్‌ని టీజ్ చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29e
  • రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోన్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్స్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలాగే Vivo V29e యొక్క డెడికేటెడ్ మైక్రోసైట్ కూడా చాలా రోజులుగా అధికార వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఇటీవలె కంపెనీ Vivo V29e డివైజ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభించనుందని స్ఫష్టం చేసింది.

ఇంకా అనౌన్స్ కావాల్సిన Vivo V29e లాంచ్ తేదీ

Vivo V29e స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫోన్ డిజైన్, కలర్స్, ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Vivo V29e డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ డివైజ్ వస్తోంది. డిజైన్ విషయానికి వస్తే ప్రీమియమ్ లుక్ తో ఈ ఫోన్ వస్తోంది.

Vivo V29e డివైజ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, డ్యూయల్-టోన్ రియర్ డిజైన్, షిమ్మరీ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇక ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి ఎడమవైపున డైమండ్ ప్యాటర్న్ ఉంది. ఇంకా డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. కెమెరా లెన్స్ గోల్డ్ కలర్ రింగ్ తో ఉంది. టీజర్స్ ద్వారా వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.

Vivo V29e కెమెరా స్పెసిఫికేషన్స్

Vivo V29e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. నైట్ పొట్రెయిట్స్ ని ఇది బాగా తీస్తుంది. ఇంకా ఈ డివైజ్ లో 50ఎంపి సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇంకా ఈ కెమెరా ఐ ఆటో ఫోకస్ తో వస్తోంది.

Vivo V29e ధర (అంచనా)

Vivo V29e టీజర్స్ ద్వారా ధర ఎంత ఉండనుందో అన్న విషయాన్ని ఇప్పటికే వివో హింట్ ఇచ్చింది. స్లిమ్మెస్ట్ 3డీ కర్వ్డ్ స్క్రీన్ తో ఈ ఫోన్ రానున్నట్లు కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండనుంది. Vivo V29e ఈ ధర శ్రేణిలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్ ధర రూ.30,000 వద్ద ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.