Home News లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్

లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights
  • ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Vivo V29e
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వస్తోన్న డివైజ్
  • 7.57 మి.మీ అల్ట్రా స్లిమ్‌గా ఉండనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు 28 న Vivo V29e డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మొబైల్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో Vivo V29e హ్యాండ్సెట్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలిసాయి. మరి ఈ మిడ్-బడ్జెట్ రేంజ్ డివైజ్ లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29e వివరాలు (లీక్)

వివో నుంచి రాబోవు కొత్త్ ఫోన్ Vivo V29e యొక్క ట్రెయినింగ్ మెటీరియల్ Tech Outlook వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. దీని ద్వారా పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలిసాయి.

డిజైన్

Vivo V29e యొక్క డిజైన్ గురించి మాట్లాడితే ఇది 3డీ కర్వ్ డిజైన్ కలిగి ఉంది. 7.57 మి.మీ మందం కలిగి, 180.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ అత్యంత సన్ననైన 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇక ధర విషయానికి వస్తే, మిడ్-బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.

Vivo V29e స్పెసిఫికేషన్స్ (లీక్)