Home News Vivo V29e: 3D కర్వ్డ్ 120Hz డిస్ప్లేతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ29ఈ

Vivo V29e: 3D కర్వ్డ్ 120Hz డిస్ప్లేతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ29ఈ

Highlights
  • ఆగస్టు చివర్లో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29e
  • కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ తో వస్తోన్న డివైజ్
  • ఇటీవలె బీఐఎస్, గీక్‌బెంచ్ పై కనిపించిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు నెల మూడో వారంలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ లైనప్ లో భాగమైన Vivo V29e డివైజ్ గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐఎమ్ఈఐ వంటి సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది.

తాజాగా Vivo V29e యొక్క ఫోటో 91మొబైల్స్ కి అందింది. ఈ పిక్ ని ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ పంచుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Vivo V29e డివైజ్ Vivo V29 సిరీస్ లో మొదటగా భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29e స్పెసిఫికేషన్స్

Vivo V29e లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Vivo V29e స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఈ నెల ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఫోన్ ప్రమోషన్లు మొదలయ్యే చాన్స్ ఉంది. అలాగే Vivo V29e ఫోన్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా కంపెనీ నుంచి వస్తుందని ఆశించవచ్చు.