ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 5G సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 5G మరియు Vivo V30 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి. తొలుత ఫిలిప్పైన్స్ లో గ్లోబల్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలె వివో ఫిలిప్పైన్స్ వెబ్సైట్ అఫీషియల్ గా Vivo V30 5G ని టీజ్ చేసింది. దీంతో ఆ దేశంలో త్వరలో లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. తాజాగా పారస్ గుగ్లాని Vivo V30 5G యొక్క డిజైన్ రివీల్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Vivo V30 5G డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు (లీక్)
This is Global Vivo V30 5G
12GB + 12GB (Virtual) , SD7Gen3, 80W, 3D Curved , 185 Grams
Ocean Blue, Elegant Black
Coming soon! pic.twitter.com/75hVcHbsYJ
— Paras Guglani (@passionategeekz) January 30, 2024
- Vivo V30 5G డిజైన్ గురించి మాట్లాడితే గత నెలలో చైనాలో లాంచైన Vivo S18 మాదిరి ఉంటుంది.
- Vivo V30 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటి క్రింద ట్విన్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉన్నాయి.
- Vivo V30 5G లో కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ వివరాలు అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ అయ్యాయి.
Vivo V30 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- Vivo V30 5G స్మార్ట్ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.
- Vivo V30 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.
- గుగ్లాని ప్రకారం, Vivo V30 5G డివైజ్ ఓషన్ బ్లూ మరియు ఎలిగంట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo V30 5G డివైజ్ 185 గ్రాముల బరువు ఉంటుంది.
