ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 గురించి తెలుసుకుందాం. వివో వీ30 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. సరే, ఓసారి Vivo V30 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V30 ధర, లభ్యత
Vivo V30 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.33,999 గా నిర్ణయించారు.
Vivo V30 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.37,999 గా ఉంది.
Vivo V30 స్మార్ట్‌ఫోన్ అండమాన్ బ్లూ, పికాక్ గ్రీన్ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
నేటి నుంచి Vivo V30 ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చి 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు వివో వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.
Vivo V30 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
