ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. రీసెంట్ గా Vivo V30 టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎఫ్‌సీసీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. Vivo V30 స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1150 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి, FCC, IMDA సర్టిఫికేషన్ వివరాలు చూద్దాం.
Vivo V30 ఎఫ్‌సీసీ, ఐఎండీఏ సర్టిఫికేషన్ వివరాలు
- Vivo V30 డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్సైట్ లో V8073L0A0 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo V30 డివైజ్ 4895ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కార్డ్, ఎన్ఎఫ్సీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- మరోవైపు, ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా Vivo V30 కి సంబంధించిన ఎటువంటి వివరాలు రివీల్ కాలేదు.
- ఇక గీక్‌బెంచ్ డేటాబేస్ ప్రకారం, Vivo V30 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రాబోతుందని తెలిసింది.
Vivo V30 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
- ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
- కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
- ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
