50MP సెల్ఫీ కెమెరాతో మెక్సికోలో లాంచైన Vivo V30 Lite 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • మెక్సికోలో లాంచైన Vivo V30 Lite 5G
  • Snapdragon 695 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo V30 Lite 5G ధర MXN 8,999 (సుమారు రూ.44,065)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo మెక్సికో దేశంలో Vivo V30 Lite 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గత మోడల్ Vivo V29 Lite 5G కి సక్సెసర్ గా వచ్చింది. వివో వీ29 లైట్ 5జీ ఈ ఏడాది జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఇకపోతే, Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo V30 Lite 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Vivo V30 Lite 5G ప్రస్తుతం మెక్సికన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
  • Vivo V30 Lite 5G డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధరను MXN 8,999 (సుమారు రూ.44,065) గా నిర్ణయించారు.
  • Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ బ్లాక్ మరియు రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V30 Lite 5G ఫోన్ ని రానున్న వారాల్లో ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
  • Vivo V30 Lite 5G పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Lite 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2400 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఆరా రింగ్-ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo V30 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo V30 Lite 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Lite 5G డివైజ్ 162.35 మి.మీ పొడవు, 74.85 మి.మీ వెడల్పు, 7.69 మి.మీ మందం మరియు 190 గ్రాముల బరువు ఉంటుంది.

Source: Gizmochina