ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో V30 Lite యొక్క కొత్త మోడల్‌ని లాంచ్ చేసింది. రష్యన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. మెక్సికో, యూఏఈ దేశాల్లో లాంచైన వేరియంట్ కి రష్యన్ మోడల్ కి తేడా ఉంది. రెండింట్లో చిప్సెట్ ఒకటి కాదు. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రష్యాలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 Lite 4G డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo V30 Lite స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Vivo V30 Lite 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V30 Lite 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 4G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: Vivo V30 Lite 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Vivo V30 Lite 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo V30 Lite 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
