ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. పవర్ఫుల్ కెమెరా సెటప్ తో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. ఇండోనేషియాలో Vivo V30 Pro ప్రస్తుతం విడుదలైంది. భారత్ లో మార్చి 7న ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V30 Pro ధర
- Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- Vivo V30 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇండోనేషియాలో Rp.89,99,000 (సుమారు రూ.47,000) గా ఉంది.
- మార్చి 7న భారత్ లో Vivo V30 Pro 5G లాంచ్ అవుతుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.45,000 వద్ద ఉండే అవకాశం ఉంది.
Vivo V30 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- బ్యాటరీ: Vivo V30 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ప్రాసెసర్: Vivo V30 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
- ఓఎస్: Vivo V30 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
