ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V30 Pro ధర
- Vivo V30 Pro స్మార్ట్ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర IDR 89,99,000 (సుమారు రూ.47,699) గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
- Vivo V30 Pro డివైజ్ 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Vivo V30 ధర
- Vivo V30 రెండు మెమొరీ వేరియంట్స్ లో మార్కెట్ లో లాంచ్ కానుంది. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 59,99,000 (సుమారు రూ.31,799) గా ఉంటుందని సమాచారం.
- Vivo V30 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 69,99,000 (సుమారు రూ.37,199) గా ఉంటుందని లీక్ ద్వారా రివీల్ అయ్యింది.
- Vivo V30 డివైజ్ గరిష్టంగా 12జిబి వర్చువల్ ర్యామ్ పవర్ ని అందిస్తుంది.
- Vivo V30 డివైజ్ ఇండోనేషియాలో బ్లాక్, వైట్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Vivo V30 సిరీస్ యొక్క భారత మార్కెట్ ధరలు వేరుగా ఉండనున్నాయి.
Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు
- Vivo V30 సిరీస్ భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లోని ఫోన్లకు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం అధికార వెబ్సైట్ లో కనిపిస్తోంది.
- Vivo V30 సిరీస్ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.
Vivo V30 Pro ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
- Vivo V30 Pro డివైజ్ జీస్ ఆప్టిక్స్, ఓఐఎస్ పొట్రెయిట్ కెమెరా, ఆరా లైట్ తో వస్తోంది.
- 2024 లో స్లిమ్మెస్ట్ ఫోన్ గా Vivo V30 Pro పిలవబడుతోంది. ఈ డివైజ్ ఎంతో తేలిగ్గా ఉంటుందని సమాచారం.
- Vivo V30 Pro డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
- Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.
- Vivo V30 Pro డివైజ్ క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
