Home News Vivo V30e ఇండియా లాంచ్ ఖరారు

Vivo V30e ఇండియా లాంచ్ ఖరారు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30e
  • ఏప్రిల్ ఆఖర్లో లేదా మే ఆరంభంలో లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వీ30 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే వీ-సిరీస్ లో Vivo V30, V30 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ.33,999 మరియు రూ.41,999 గా ఉన్నాయి. తాజాగా Vivo V30e ఇండియా లాంచ్‌ని కంపెనీ ఖరారు చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30e ఇండియా లాంచ్

Vivo బ్రాండ్ త్వరలో V30e స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ లో ఈ ఫోన్ యొక్క ప్రొడక్ట్ పేజీ కనిపిస్తోంది. దీంతో ఫోన్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అయితే లాంచ్ తేదీ మాత్రం వెల్లడికాలేదు. ఏప్రిల్ ఆఖర్లో లేదా మే ఆరంభంలో వివో వీ30ఈ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30e లో కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ 3డీ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో ఏ ప్రాసెసర్ ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పొట్రెయిట్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.