Home News Vivo: మే 2న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30e

Vivo: మే 2న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30e

Highlights
  • Vivo V30e ఇండియా లాంచ్ తేదీ ఖరారు
  • మే 2న భారత్ లో లాంచ్ అవుతోన్న డివైజ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు ఫోన్లు V30, V30 Pro ఉన్నాయి. ఇప్పుడు Vivo V30e కూడా వీటితో చేరనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మే 2వ తేదీన Vivo V30e భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి రానుంది. సరే, ఓసారి Vivo V30e యొక్క ఇండియా లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V30e ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Vivo V30e స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 2న లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వివో సంస్థ అధికారికంగా ఒక టీజర్ ద్వారా వెల్లడించింది.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo V30e భారత్ లో సేల్‌కి వస్తోంది. 3డీ కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30e లో కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ 3డీ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో ఏ ప్రాసెసర్ ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పొట్రెయిట్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.