Vivo V30e: అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్

Highlights

  • నేడు భారత్‌లో Vivo V30e లాంచ్
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర రూ.27,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ గత మోడల్ వివో వీ29ఈ కి సక్సెసర్‌గా ఎంట్రీ ఇచ్చింది. Vivo V30e లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo V30e యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30e ధర, సేల్ వివరాలు

Vivo V30e ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V30e 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా పెట్టారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ కార్డులపై రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ, రూ.2500 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఆఫ్‌లైన్ స్టోర్స్ లో 10 శాతం క్యాష్‌బ్యాక్, 12 నెలల జీ-డౌన్ పేమెంట్ ఆప్షన్, వివో షీల్డ్ పై 40 శాతం డిస్కౌంట్ వంటి బెనిఫిట్స్ లభించనున్నాయి.

Vivo V30e స్మార్ట్‌ఫోన్ వెల్వెట్ రెడ్ మరియు సిల్వర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V30e డివైజ్ ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ మరియు వివో వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్‌కి అందుబాటులో ఉంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30e లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఫీచర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V30e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30e లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.