
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తాజాగా వీ40 సిరీస్‌ను యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Vivo V40 డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫోన్ బాక్స్ లో చార్జర్ ఇవ్వలేదు. ఇది వివో అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి భారత్ లో రాబోవు వివో ఫోన్లు కూడా ఇలా చార్జర్ లేకుండా వాస్తే కష్టమే. ఇక Vivo V40 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రానగ్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి జీస్ లెన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo V40 5G ధర
Vivo V40 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo V40 5G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 599 యూరోలు (సుమారు రూ.53,000) గా నిర్ణయించారు.
Vivo V40 5G స్మార్ట్‌ఫోన్ స్టెల్లా సిల్వర్ మరియు నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై నెలలో ఈ డివైజ్ సేల్ కి వస్తోంది.
Vivo V40 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉన్నాయి.
మెమొరీ: Vivo V40 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
కెమెరా: Vivo V40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.











