
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్‌గా వీ40 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో వివో వీ40 5జీ, వివో వీ40 లైట్ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 Lite 5G గురించి తెలుసుకుందాం. వివో వీ40 లైట్ 5జీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచైంది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo V40 Lite 5G ధర
Vivo V40 Lite 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతుంతో తెలుసుకుందాం.
Vivo V40 Lite 5G ధర 399 యూరోలు (సుమారు రూ.35,599) గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్రౌన్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo V40 Lite 5G యొక్క ఇండియా లాంచ్ పై ఇంకా స్పష్టత లేదు. కానీ, జులై నెలలో లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Vivo V40 Lite 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 Lite 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V40 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
మెమొరీ: Vivo V40 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
కెమెరా: Vivo V40 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని అల్ట్రా-సెన్సింగ్ కెమెరా, 8ఎంపి వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి హెచ్డీ కెమెరా ఇచ్చారు.
ఓఎస్: Vivo V40 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
బ్యాటరీ: Vivo V40 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo V40 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











