ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. గత సిరీస్ వీ30 కి సక్సెసర్‌గా వీ40 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. వీ40 లైనప్ లో Vivo V40, Vivo V40 Pro, Vivo V40 Lite వంటి మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V40 Lite మోడల్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ FCC పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Vivo V40 Lite ఎఫ్‌సీసీ లిస్టింగ్
Vivo V40 Lite స్మార్ట్‌ఫోన్‌ను ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పై తొలుత 91mobiles గుర్తించింది. ఈ డివైజ్ V2341 మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.
ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై Vivo V40 Lite డివైజ్ 5390 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. లాంచ్ సమయంలో దీన్ని 5,500 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రజెంట్ చేయవచ్చు.
లిస్టింగ్ లో Vivo V40 Lite 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ ఆప్షన్స్ తో కనిపించింది.
Vivo V40 Lite డివైజ్‌ను Sunwoda Electronics CO. LTD తయారు చేసినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 SE 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V40 SE 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo V40 SE 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా: Vivo V40 SE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Vivo V40 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Vivo V40 SE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
