Home News Vivo V40 Lite: రివీలైన వివో వీ40 లైట్ గ్లోబల్ వేరియంట్ ధర, డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్

Vivo V40 Lite: రివీలైన వివో వీ40 లైట్ గ్లోబల్ వేరియంట్ ధర, డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights
  • రివీలైన Vivo V40 Lite పూర్తి స్పెసిఫికేషన్స్
  • వైట్, మెరూన్ కలర్ ఆప్షన్స్
  • ధర 399 యూరోలు (సుమారు రూ.35,900)

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/06/Vivo-V40-Lite-render.jpg

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో వివో వీ40, వీ40 ప్రో, వీ40 లైట్ మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా వీ40 స్పెసిఫికేషన్స్, రెండర్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు Vivo V40 Lite యూరోపియన్ వేరియంట్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎక్స్‌క్లూజివ్ గా 91mobiles కి అందాయి. టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే సౌజన్యంతో ఈ వివరాలను మీకోసం 91మొబైల్స్ తీసుకొచ్చింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 Lite డిజైన్

Vivo V40 Lite డివైజ్ యొక్క అఫీషియల్ ఇమేజెస్ గమనిస్తే డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.

కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్, సన్నని బెజెల్స్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఈ ఫోన్ ముందువైపు కనిపిస్తున్నాయి.

Vivo V40 Lite లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. మిడిల్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అని తెలుస్తోంది.

హ్యాండ్సెట్ వెనుకవైపు గమనిస్తే, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ తో పాటు ఆరా స్మార్ట్‌లైట్ ఉన్నాయి. వివో వీ40 మాదిరి, లైట్ వర్షన్ బ్యాక్ ప్యానెల్ పై జీస్ బ్రాండింగ్ కనిపించడం లేదు.

Vivo V40 Lite డివైజ్ వైట్ మరియు మెరూన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ టెక్షర్డ్ డ్యూయల్-టోన్ మాదిరి డిజైన్ తో ఉన్నట్లు అర్థమవుతోంది.

Vivo V40 Lite ధర (అంచనా)

Vivo V40 Lite డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 399 యూరోలు (సుమారు రూ.35,900) గా ఉంటుందని టిప్‌స్టర్ సుదాన్శు చెబుతున్నారు.

Vivo V40 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 Lite లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V40 Lite లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40 Lite డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Vivo V40 Lite లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V40 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

కనెక్టివిటీ: Vivo V40 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 Lite లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ64 రేటింగ్, 8జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.