ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో V40 సిరీస్ లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 Pro గురించి తెలుసుకుందాం. Vivo V40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Vivo V40 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, జీస్ ఆప్టిక్స్ ఉన్నాయి. ఓసారి ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo V40 Pro ధర, లభ్యత
Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
Vivo V40 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.49,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.55,999 గా ఉంది. Vivo V40 Pro డివైజ్ గంగాస్ బ్లూ, టైటానియమ్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.
Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 13వ తేదీ నుంచి సేల్ కి వస్తోంది. వివో వీ40 ఆగస్టు 19న సేల్ కు రానుంది. ప్రీ-బుకింగ్స్ నేటి నుంచి మొదలయ్యాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా, 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్, 12 నెలల జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ వంటి ప్రయోజనాలు రిటైల్ స్టోర్స్ లో లభిస్తాయి.
ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్ ద్వారా కూడా Vivo V40 Pro ని కొనుగోలు చేయవచ్చు. వీరికి హెచ్డీఎఫ్‌సీ లేదా ఎస్బీఐ కార్డ్ పై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Vivo V40 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 Pro 5G లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 452పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా కవర్ గ్లాస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V40 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్-జీ715 ఎంపీ11 గ్రాఫిక్స్ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Vivo V40 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: Vivo V40 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Vivo V40 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ప్రైమరీ ఏఎఫ్ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్816 ఏఎఫ్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎక్స్ డిజిటల్ జూమ్ టెలీఫోటో కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. జీస్ ఆప్టిక్స్ ను ఈ కెమెరా సిస్టమ్ లో అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఎఫ్ జీస్ సెన్సర్ ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo V40 Pro 5G లో డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Vivo V40 Pro 5G లో ఐపీ68 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Vivo V40 Pro 5G డివైజ్ 164.3 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.58 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
