
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G గూగుల్ ప్లే లిస్ట్ వివరాలు
- వివో సంస్థ కనీసం రెండు 5జీ డివైజెస్ ని గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవి Vivo V40 SE 5G మరియు Vivo Y200e 5G పేర్లతో లాంచ్ కానున్నాయి.
- గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై Vivo V40 SE 5G ఫోన్ V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo V30 SE డివైజ్ V2327 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo Y200e 5G ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూడేళ్ళ తర్వాత వివో సంస్థ తన SE సిరీస్ ను మరలా పరిచయం చేస్తోంది.
- ఇటీవల వివో తన లోయర్ మిడ్-రేంజ్ వీ-సిరీస్ ఫోన్లకు Vivo V29 ‘Lite’, Vivo ‘V29e’ అనే పేర్లను పెట్టింది.
- మరొక గమనించదగిన విషయం ఏంటంటే, V30 సిరీస్ నుంచి నేరుగా V40 సిరీస్ కి జంప్ చేసింది. గతంలో వివో ఈ విధంగా చేయలేదు.
Vivo Y200 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
- ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
- ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.











