ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Vivo V40 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వివో వీ40 అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి + 50ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.
Vivo V40 ధర
నెట్టింట్లో లభించిన సమాచారం గనుక నిజమైతే, Vivo V40 రూ.40,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చిప్సెట్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ గమనిస్తే, ఈ ఫోన్ ప్రారంభ ధర భారత్ లో రూ.36,999 ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇప్పుడు Vivo V40 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ స్పెసిఫికేషన్స్ ను టిప్‌స్టర్ సంజు చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Vivo V40 స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: Vivo V40 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.
కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో జీస్ ఆప్టిక్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.
