
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.
Vivo V40 మరియు Honor 200 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Vivo V40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Honor 200 లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
పీసీమార్క్ టెస్ట్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది.
పీసీమార్క్ టెస్ట్ లో వివో వీ40 13 గంటల స్కోర్ చేసింది. మరోవైపు, హానర్ 200 10 గంటల 52 నిమిషాల స్కోర్ చేసింది.
విజేత: Vivo V40
వీడియో స్ట్రీమింగ్ టెస్ట్
రెండు స్మార్ట్‌ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్ట్ సమయంలో రెండు ఫోన్లలోనూ ఒకే విధమైన ఆడియో/బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి.
ఈ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. హానర్ 200 బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 165ఎంఏహెచ్ శక్తిని వాడుకోగా, హానర్ 200 208ఎంఏహెచ్ శక్తిని వాడుకుంది.
విజేత: Vivo V40
గేమింగ్ టెస్ట్
గేమింగ్ టెస్ట్ భాగంగా, రెండు ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను 30 నిమిషాల పాటు ఆడాం. రెండు ఫోన్లలో బేస్ సెట్టింగ్స్ ను ఒకే విధంగా ఉంచడం జరిగింది.
గేమింగ్ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 5.3 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, హానర్ 200 బ్యాటరీ 7.3 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 880ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకోగా, హానర్ 200 1144 ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకుంది.
విజేత: Vivo V40
చార్జింగ్ టెస్ట్
వివో వీ40 లో పెద్ద బ్యాటరీ ఉండగా, హానర్ 200 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వివో వీ40 ఫోన్‌ని 80 వాట్ ఛార్జర్ తో చార్జ్ చేయగా 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది.
మరోవైపు, హానర్ 200 ని 100 వాట్ చార్జర్ తో చార్జ్ చేయగా.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 39 నిమిషాల సమయం పట్టింది.
విజేత: Vivo V40
ఏది బెటర్?
వివో వీ40 మరియు హానర్ 200 ఫోన్ల యొక్క బ్యాటరీ కంపేరిజన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ గల వివో వీ40, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ గల హానర్ 200 పై విజేతగా నిలిచింది. హానర్ 200 లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్.