
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ40-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇప్పటికే V40, V40 Pro ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo V40e కూడా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఈ ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా, వివో వీ40ఈ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Vivo V40e లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
Vivo V40e యొక్క ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది.
లీక్ ప్రకారం, Vivo V40e డివైజ్ సెప్టెంబర్ ఆఖర్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా డివైజ్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు.
Vivo V40e డిజైన్ (లీక్)
లీకైన Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ను గమనిస్తే, రాయల్ బ్రాంజ్ కలర్ లో డివైజ్ కనిపించింది. ఇతర కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి.
డిజైన్ విషయానికి వస్తే, Vivo V40e లో ఓవర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ పై ఉంటుంది. ఆరా లైట్ ఎల్ఈడీ కూడా అందిస్తున్నారు.
ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, 3డీ కర్వ్డ్ డిస్ప్లేను ఈ ఫోన్ లో అందించినట్లు అర్థమవుతోంది. ఓవరాల్‌గా, Vivo V40e చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
Vivo V40e స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Vivo V40e లో ఉండే డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo V40e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Vivo V40e డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Vivo V40e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో రానుంది.