వివో సంస్థ రీసెంట్ గా తన సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Vivo X Fold 2 ని కన్ఫర్మ్ చేసింది. 2023 ఏప్రిల్ చివర్లో చైనాలో Vivo X Fold 2 లాంచ్ కానుంది. అయితే లాంచ్ కి ముందు వివో బ్రాండ్ Vivo X Fold 2 డివైజ్ ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వదిలింది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబో పై Vivo X Fold 2 యొక్క పిక్స్ ని వివో పోస్ట్ చేసింది. సరే పదండి, Vivo X Fold 2 డివైజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ
vivo X Fold 2.#vivo #vivoXFold2 pic.twitter.com/QB7HXIUPgw
— Mukul Sharma (@stufflistings) March 30, 2023
పైన పిక్చర్స్ లో కనిపిస్తోన్న విధంగా, Vivo X Fold 2 ఉండనుంది. ఈ డివైజ్ రెడ్ కలర్ లో లాంచ్ కానుంది. గత వివో ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఇదే విధంగా లాంచ్ అయ్యాయి. ఫోన్ రియర్ ప్యానెల్ చూడటానికి వివో ఫ్లాగ్షిప్ డివైజెస్ మాదిరి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మెటల్ చాసిస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. జీస్ బ్రాండింగ్ కనిపిస్తోంది.
Vivo X Fold 2 ఫ్రంట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సెంటర్ అలైన్డ్ సింగిల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాల రెజుల్యూషన్ ఇంకా తెలియదు. ఓవరాల్ గా ఫోటోస్ ని బట్టి Vivo X Fold 2 డివైజ్ కాంపాక్ట్ డిజైన్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. గత మోడల్ కంటే స్లిమ్ గా Vivo X Fold 2 ఉంటుందని తెలుస్తోంది.
Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఇస్తున్నారు. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ డివైజ్ లో 50ఎంపి + 12ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
Vivo X Fold 2 లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. త్వరలోనే ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించి అధికార ప్రకటన రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
