హైలైట్స్:
- గీక్ బెంచ్ మరియు చైనాకి చెందిన 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిన Vivo X Fold S
- సింగిల్ కోర్ టెస్టులో పై 1319 పాయింట్, మల్టీ-కోర్ టెస్టులో 4045 పాయింట్లు సాధించిన ఈ మడత ఫోన్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 12జిబి ర్యామ్ తో రానున్న Vivo X Fold S
Vivo X Fold లాంచ్ చేసిన తర్వాత, వివో కంపెనీ తన కొత్త మడత ఫోన్ ని త్వరలో చైనాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Vivo X Fold S అనే పేరుతో రానున్న ఈ ఫోన్ గతేడాది వచ్చిన మడత ఫోన్ కంటే విభిన్న ఫీచర్లను కలిగి ఉండనుంది. ఈ ఏడాది చివర్లో Vivo X Fold S లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ తరుణంలో, Vivo X Fold S గీక్ బెంచ్ తో పాటు చైనా కు చెందిన 3సీ సర్టిఫికేషన్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ర్యామ్, ఓఎస్, ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్, చిప్సెట్ వంటి వివరాలు తెలిశాయి.
X2229A అనే మోడల్ నంబర్ తో Vivo X Fold S కనిపించింది. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్టు లో 1319 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 4045 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్స్ ని బట్టి Vivo X Fold S ఫ్లాగ్షిప్ ఫోన్ అని, మిడ్-రేంజ్ ఫోన్ కాదని స్పష్టమవుతోంది.
గీక్‌బెంచ్ పై కనిపించిన Vivo X Fold S
Vivo X Fold S గీక్ బెంచ్ పై కనిపించింది. వీ2229ఏ అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. మదర్ బోర్డ్ సెక్షన్ ‘taro’ అని మెన్షన్ చేసింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కు సంబంధించినది. అడ్రెనో 730 జీపీయూ, 12జిబి ర్యామ్ ఈ ఫోన్లో ఉండనున్నాయి. అయితే ఇతర ర్యామ్, స్టోరేజీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉండే అవకాశముంది. ఇక Vivo X Fold S ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కస్టమైజ్డ్ టాప్లెడ్ యూఐ పై పని చేయనుంది.
3సీ పై కనిపించిన Vivo X Fold S
Vivo X Fold S చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ని కలిగి ఉంటుందని తెలిసింది.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై Vivo X Fold S ఫోల్డబుల్ ఫోన్ 2కే ప్రైమరీ ఎల్టీపీవో డిస్ప్లే, 1హెర్ట్జ్-120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని తెలిపింది. Vivo X Fold S, 4700ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండనుందని సమాచారం. ఈ ఫోన్ జీఏఎన్ చార్జర్ తో రానుందని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది. ఇప్పుడు కెమెరా విభాగం విశేషాలను తెలుసుకుందాం. Vivo X Fold S లో 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ మెరుగైన హింజ్, బిల్డ్ క్వాలిటీని కలిగి ఉండనుంది. Vivo X Fold S లో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ బాడీ లెదర్ ఫినిష్ తో రానుందని సమాచారం.