200MP టెలీఫోటో లెన్స్ తో వస్తోన్న Vivo X100 Pro+; లీకైన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • తాజాగా లీకైన Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్
  • 200ఎంపి టెలీఫోటో లెన్స్ తో వస్తోన్న డివైజ్

Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత వివో కంపెనీ తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా టాప్ మోడల్ Vivo X100 Pro+ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Vivo X100 Pro+ హ్యాండ్సెట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200ఎంపి టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై టిప్‌స్టర్ Fixed Focus Digital Vivo X100 Pro+ యొక్క కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది.
  • Vivo X100 Pro+ డివైజ్ 50ఎంపి సోని 1-ఇంచ్ ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా (వేరియబుల్ అపర్చర్) తో వస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. వేరియబుల్ అపర్చర్ ఫీచర్ వివో ఎక్స్90 ప్రో+ లో లేదు. ఇమేజ్ యొక్క ఎక్స్‌పోజర్ పై కంట్రోల్ ని ఈ ఫీచర్ మెరుగుపరుస్తుంది.
  • ఇంకా Vivo X100 Pro+ లో 50ఎంపి ఐఎంఎక్స్598 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. ఒక స్పెసిఫికేషన్ ఆకట్టుకుంటోంది. అదే 200ఎంపి టెలీఫోటో (పెరిస్కోప్) లెన్స్.
  • Vivo X100 Pro+ డివైజ్ లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • Vivo X100 Pro+ స్మార్ట్ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటుందని సమాచారం.
  • Vivo X100 Pro+ డివైజ్ ఐపీ68 రేటింగ్ తో వస్తోంది. దీని వల్లన ఫోన్ కి డస్ట్, వాటర్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో అందించారు.

Vivo X100 Pro+ గురించి ఇప్పటి వరకు తెలిసినవి

  • Vivo X100 Pro+ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • లాంచ్ తేదీకి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి అధికార ప్రకటన ఏదీ రాలేదు. రానున్న కొన్ని నెలల్లో Vivo X100 Pro+ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • Vivo X90 Pro+ భారత్ లో లాంచ్ కాలేదు. దీంతో Vivo X100 Pro+ లాంచ్ పై కూడా నమ్మకం లేదు. వివో నుంచి త్వరలో రాబోయే అధికార ప్రకటనతో మరింత సమాచారం తెలియనుంది.