
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో X90 సిరీస్ ని పరిచయం చేసి కొన్ని నెలలే అవుతోంది. ఈలోపే ఈ సంస్థ ఎక్స్90 సిరీస్ కి సక్సెసర్ Vivo X100 ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని టాప్ వేరియంట్ అయిన Vivo X100 Pro+ వివరాలు లీక్ అయ్యాయి. ఈ డివైజ్ 200ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఇతర వివరాలెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
లీకైన Vivo X100 Pro+ డివైజ్ రెండర్స్
చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై తరచూ పోస్టులు చేసే టిప్‌స్టర్ Fixed Focus Digital Vivo X100 Pro+ కి సంబంధించిన డిజైన్ రెండర్ ని షేర్ చేసింది. లీకైన ఇమేజ్ లో బ్లాక్ కలర్ లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఫోన్ బాటమ్ లో వివో బ్రాండింగ్, కెమెరా మాడ్యూల్ పై జీస్ బ్రాండింగ్ కనిపిస్తున్నాయి.
Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- Vivo X100 Pro+ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. మరోవైపు Vivo X100 మరియు మిడ్-వేరియంట్ అయిన Vivo X100 Pro డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.
- ఇలాగే మరొక రిపోర్ట్ ద్వారా, మూడు మోడల్స్ కూడా పెరిస్కోప్ లెన్స్ తో రానున్నాయని తెలిసింది. దీని ద్వారా యూజర్లు మెరుగైన జూమింగ్ అనుభూతిని పొందనున్నారు.
- Vivo X100 Pro+ డివైజ్ లో 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా సెన్సర్ నే వివో కొనసాగించనుందని తెలుస్తోంది. అయితే, టిప్‌స్టర్ Ice Universe ప్రకారం, టాప్-ఎండ్ వేరియంట్ 200ఎంపి టెలీఫోటో లెన్స్ తో రానుందని తెలుస్తోంది.
Vivo X100 Pro+ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
Vivo X100 Pro+ డివైజ్ లాంచ్ కి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా అధికార సమాచారం రాలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో Vivo X100 Pro+ డివైజ్ లాంచ్ కానుందని తెలుస్తోంది. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు Vivo X90 Pro+ భారత్ లో లాంచ్ కాలేదు. మరి Vivo X100 Pro+ డివైజ్ భారత్ కి వస్తుందో లేదో ఇంకా తెలియదు.











