Home News 200MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో రానున్న Vivo X100 Pro+

200MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో రానున్న Vivo X100 Pro+

Highlights
  • Vivo X100 సిరీస్ లో రానున్న X100, X100 Pro, X100 Pro+
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వస్తోన్న Vivo X100 Pro+
  • 2023 నవంబర్ లో Vivo X100 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో X90 సిరీస్ ని పరిచయం చేసి కొన్ని నెలలే అవుతోంది. ఈలోపే ఈ సంస్థ ఎక్స్90 సిరీస్ కి సక్సెసర్ Vivo X100 ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని టాప్ వేరియంట్ అయిన Vivo X100 Pro+ వివరాలు లీక్ అయ్యాయి. ఈ డివైజ్ 200ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఇతర వివరాలెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo X100 Pro+ డివైజ్ రెండర్స్

చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై తరచూ పోస్టులు చేసే టిప్‌స్టర్ Fixed Focus Digital Vivo X100 Pro+ కి సంబంధించిన డిజైన్ రెండర్ ని షేర్ చేసింది. లీకైన ఇమేజ్ లో బ్లాక్ కలర్ లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఫోన్ బాటమ్ లో వివో బ్రాండింగ్, కెమెరా మాడ్యూల్ పై జీస్ బ్రాండింగ్ కనిపిస్తున్నాయి.

Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

Vivo X100 Pro+ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Vivo X100 Pro+ డివైజ్ లాంచ్ కి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా అధికార సమాచారం రాలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో Vivo X100 Pro+ డివైజ్ లాంచ్ కానుందని తెలుస్తోంది. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు Vivo X90 Pro+ భారత్ లో లాంచ్ కాలేదు. మరి Vivo X100 Pro+ డివైజ్ భారత్ కి వస్తుందో లేదో ఇంకా తెలియదు.