Vivo సంస్థ తన తదుపరి ఫ్లాగ్షిప్ Vivo X100 సిరీస్ ని ఈపాటికి తన స్వదేశం చైనాలో లాంచ్ చేసి ఉండాల్సింది. కానీ, ఇంకా అలా జరగలేదు. ఈ సంవత్సరం చివరికల్లా వివో ఎక్స్100 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ సిరీస్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో రానున్న Vivo X100 Pro
Apple సంస్థ తన యొక్క iPhone 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు శాటిలైట్ కనెక్టివిటీని భద్రతా ఫీచర్‌గా తీసుకువచ్చింది. ఇది సెల్ కనెక్టివిటీ లేని ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయినప్పుడు అత్యవసర సేవలతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. Huawei కంపెనీ కూడా తన Mate 60 Pro డివైజ్ లో శాటిలైట్ కనెక్షన్ ద్వారా పూర్తి మొబైల్ కనెక్టివిటీని అందించడానికి ఒక అడుగు ముందుకు వేసింది.
Vivo కూడా ఇప్పుడు తన తదుపరి ఫ్లాగ్సిప్ Vivo X100 Pro డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీని అందించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనీస్ సామాజిక మాధ్యమం Weibo పై వైల్యాబ్ తన పోస్ట్ ద్వారా తెలిపింది. మోడల్ నంబర్ V2309Aతో ఉన్న Vivo X100 Pro, టూ-వే శాటిలైట్ కనెక్టివిటీని తెలిపే జాబితాతో MIIT సర్టిఫికేషన్ పై గుర్తించబడింది. సెల్యులార్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో టెక్స్ట్, చిత్రాలు, వాయిస్ రికార్డింగ్‌లు లేదా వీడియోలను పొందేందుకు ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Vivo X100 Pro డివైజ్ 5G నాన్ టెరెస్ట్రియల్ (NTN) సాంకేతికతను హ్యాండిల్ చేయగల యూనిఎస్ఓసీ వీ8821 చిప్ ని కలిగి ఉంటుందని సమాచారం. ఇక ప్రధాన ప్రాసెసర్ విషయానికి వస్తే, Vivo X100 Pro లో MediaTek Dimensity 9300 లేదా Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో అందించబడుతుందని భావిస్తున్నారు.
Vivo ఇటీవల భారతదేశంలో Vivo V29 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.32,999 గా ఉంది. Vivo X100 సిరీస్ ఎంపిక చేసిన మోడల్‌లతో వచ్చే ఏడాది భారతదేశానికి రావచ్చని సాధారణ లాంచ్ టైమ్‌లైన్ సూచిస్తోంది.
Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సీ, ఇన్ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
- కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
