Home News లీకైన Vivo X100 Pro, Pro+ స్పెసిఫికేషన్స్; IP68 రేటింగ్, 50W వైర్లెస్ చార్జింగ్ తో వస్తోన్న డివైజెస్!

లీకైన Vivo X100 Pro, Pro+ స్పెసిఫికేషన్స్; IP68 రేటింగ్, 50W వైర్లెస్ చార్జింగ్ తో వస్తోన్న డివైజెస్!

Highlights
  • X100 సిరీస్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన వివో
  • టిప్‌స్టర్ ద్వారా రివీలైన Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్
  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న వివో ఎక్స్-సిరీస్

వివో గ్లోబల్ ప్రెసిడెంట్ షెన్ వీ ఇటీవల చైనాలో రాబోయే Vivo X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ టైమ్‌లైన్‌ను ధృవీకరించారు. Vivo సంస్థ 2023 చివరి నాటికి చైనాలో Vivo X100 మరియు X100 Pro డివైజెస్ ని విడుదల చేస్తుందని Wei ధృవీకరించారు. Vivo కంపెనీ Vivo X100 Pro+ స్మార్ట్‌ఫోన్‌ను 2024 ప్రారంభంలో లాంచ్ చేస్తుందని అధికారికంగా తెలిపారు. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు Vivo X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సక్సెసర్స్ గా వస్తున్నాయి.

Vivo సంస్థ ఎక్స్100 సిరీస్ లోని స్టాండర్డ్ మరియు ప్రో మోడల్‌లను నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో వీబోలో ధృవీకరించింది. 2024 మొదటి త్రైమాసికంలో Vivo సంస్థ Vivo X ఫోల్డ్ 3ని లాంచ్ చేస్తుందని టిప్‌స్టర్ పేర్కొంది. Vivo X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 2024 Q2 లో గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

డిజిటల్ చాట్ స్టేషన్ యొక్క కొత్త పోస్ట్ రాబోయే Vivo X100 Pro మరియు Pro+ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క మరికొన్ని స్పెసిఫికేషన్‌లను నిర్ధారించింది. X100 ప్రో మరియు ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తాయని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. స్టాండర్డ్ మోడల్ IP రేటింగ్‌ను కలిగి ఉంటుందో లేదో టిప్‌స్టర్ వెల్లడించలేదు. ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయని DCS ధృవీకరించింది.

OnePlus మరియు Realme కూడా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌తో OnePlus 12 మరియు Realme GT 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను సన్నద్ధం చేయనున్నట్లు హింట్ ఇచ్చాయి. స్టాండర్డ్ X100 మోడల్ వైర్‌లెస్ ఛార్జింగ్ తో రాబోదని టిప్‌స్టర్ తెలిపారు.

Vivo X100 Pro, X100 Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)