
Vivo యొక్క X100 సిరీస్ హోమ్ మార్కెట్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోందని కంపెనీ ప్రకటించింది. Vivo X100 మరియు Vivo X100 Pro మోడల్స్ ఈ లైనప్ లో రాబోతున్నాయి. అదే సమయంలో ఈ అద్భుతమైన సిరీస్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే తాజాగా X100 ఫోన్ BIS వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఇండియా లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo X100 BIS లిస్టింగ్

- Vivo యొక్క కొత్త డివైజ్ BIS ధృవీకరణ వెబ్సైట్లో మోడల్ నంబర్ V2308తో లిస్ట్ అయ్యింది.
- జాబితాలోని మరొక డివైజ్ మోడల్ నంబర్ V2309తో కనిపించింది. ఇది ప్రో మోడల్ అయ్యుంటుందని భావిస్తున్నారు.
- ఇది కాకుండా, వెబ్సైట్లో ఇతర స్పెసిఫికేషన్లు ఏవీ వెల్లడించబడలేదు.
అయితే, బీఐఎస్ వెబ్ సైట్ పై లిస్ట్ అవ్వడంతో.. త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. - నవంబర్ 13న చైనాలో లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ భారత్‌కు వస్తుందని అంచనా వేస్తున్నారు.
Vivo X100 ధర (లీక్)
Vivo X100 ధర చైనీస్ షాపింగ్ సైట్ JD.comలో వెల్లడైంది. కొత్త మొబైల్‌ను CNY 3,999 అంటే సుమారు రూ. 46,200కి లాంచ్ చేయవచ్చని చెప్పబడింది. ఈ ధర ఫోన్ యొక్క 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ కోసం ఇవ్వబడింది. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసే సమయంలో దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.
Vivo X100 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సీ, ఇన్ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
- కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











