Vivo X80, Vivo X90 సిరీస్ లను చైనా మరియు భారత్ లో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు వీటి సక్సెసర్ Vivo X100 లైనప్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త సిరీస్ 2023 చివర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో రానున్న మోడల్స్ ఇవే: Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+. ఇప్పుడు ప్రకటనకు ముందు, మూడు మోడల్స్ యొక్క చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి.
Vivo X100 సిరీస్ చిప్సెట్స్
- డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X100, Vivo X100 Pro డివైజెస్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తున్నాయి.
- లేటెస్ట్ డైమెన్సిటీ చిప్సెట్స్ తో వస్తోన్న మొదటి లైనప్ గా నిలవనున్న Vivo X100 సిరీస్.
- ఇకపోతే గత మోడల్స్ Vivo X90, Vivo X90 Pro డైమెన్సిటీ 9200 చిప్‌తో వచ్చాయి.
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోన్న Vivo X100 Pro+
- 2023 అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 26 మధ్య జరిగే టెక్ సమ్మిట్ లో లాంచ్ కానున్న క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్.
Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- Vivo X100 Pro డివైజ్ 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ సెన్సర్ తో రానుంది. ఈ సెన్సర్ Vivo X90 Pro+ లో కూడా కనిపించింది.
- Vivo X100 Pro+ వేరియబుల్ అపెర్చర్ కి సపోర్ట్ చేయనుంది. దీని ద్వారా మెయిన్ కెమెరా అపెర్చర్ ని యూజర్ మాన్యువల్ గా కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.
- మెయిన్ సెన్సర్ కి తోడుగా ఒక పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటుంది. ఇది హయ్యర్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వివో తయారు చేసిన వీ3 చిప్ ఈ డివైజ్ లో ఉంటుంది.
- Vivo X100 Pro+ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో రానుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.
