Home News Vivo X100: MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌కి వస్తోన్న మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Vivo X100: MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌కి వస్తోన్న మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న డివైజెస్
  • 6.78-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లేతో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఇండియాలో లాంచ్ అవుతోన్న మొదటి సిరీస్ Vivo X100 అని కంపెనీ చెబుతోంది. ఇక ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. జనవరి ఆరంభంలో Vivo X100 సిరీస్ లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించలేదు. సరే, ఓసారి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ అంటుటు స్కోర్స్, Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

MediaTek Dimensity 9300 AnTuTu స్కోర్

Vivo ఫ్లాగ్షిప్ Vivo X100 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ సిరీస్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు, భారత్ లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. కాగా, ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 2,212,302 పాయింట్లుగా ఉంది. అంటే మునుపటి తరం చిప్ కంటే ఇది 33 శాతం ఎక్కువ శక్తివంతమైనదని నిరూపితమైంది.

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్