Home News Vivo: 200MP పెరిస్కోప్ కెమెరాతో చైనాలో లాంచైన Vivo X100 Ultra

Vivo: 200MP పెరిస్కోప్ కెమెరాతో చైనాలో లాంచైన Vivo X100 Ultra

Highlights
  • చైనాలో Vivo X100 Ultra లాంచ్
  • 16జిబి ర్యామ్, 5500mAh బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో నేడు ఎక్స్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo X100 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోటోగ్రఫీ, గేమింగ్, క్విక్ చార్జింగ్ వంటి విషయాల్లో ఈ ఫోన్ అద్భుతంగా పెర్ఫామ్ చేయగలదు. ఈ ఫోన్ లో 200ఎంపి పెరిస్కోప్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఐపీ68/69 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Vivo X100 Ultra ధర

Vivo X100 Ultra డివైజ్ చైనాలో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo X100 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6499 యువాన్లు (సుమారు రూ.75,100) గా నిర్ణయించారు.

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 7299 యువాన్లు (సుమారు రూ.84,200) గా ఉంది.

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 7999 యువాన్లు (సుమారు రూ.92,300) గా ఉంది.

Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ టైటానియమ్, వైట్ మూన్‌లైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo X100 Ultra లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ శాంసంగ్ ఈ7 అమోలెడ్ ఎల్టీపీవో స్క్రీన్, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo X100 Ultra డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo X100 Ultra లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-900 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 200ఎంపి శాంసంగ్ ఎస్5కేహెపి9 3.7x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెఎన్1 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo X100 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo X100 Ultra లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే స్క్రీన్, డ్యూయల్ స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ సిమ్, వై-ఫై 7, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, యూఎస్బీ-సీ (యూఎస్బీ 3.2), శాటిలైట్ కనెక్టివిటీ (16జిబి + 1టిబి ఆప్షన్‌కి వర్తింపు), ఐపీ69/ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo X100 Ultra డివైజ్ 164.07 మి.మీ పొడవు, 75.57 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 229 గ్రాముల బరువు ఉంది.