ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు రానున్నాయి. ఈ డివైజెస్ చైనాలో నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. తర్వాత భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి. అయితే ఇండియా లాంచ్ కి సంబంధించి ఇంకా కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఒక టిప్‌స్టర్ ద్వారా Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ వివరాలు చూద్దాం.
Vivo X100, Vivo X100 Pro లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
- టిప్‌స్టర్ పండా నేడు Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
- లీక్ ప్రకారం, నవంబర్ 6 న మీడియాటెక్ తన డైమెన్సిటీ 9300 చిప్ ని అనౌన్స్ చేయనుంది.
- ఇదే ప్రాసెసర్ ని Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో వాడనున్నట్లు సమాచారం.
- దీంతో Vivo X100 సిరీస్ నవంబర్ 13, 14 లేదా 15 తేదీల్లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- పైన పేర్కొనబడిన లాంచ్ టైమ్‌లైన్ వివరాలు కాకుండా, మరొక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
- Vivo X100 లో సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఇంకా 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని తెలుస్తోంది.
- Vivo X100 Pro గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా ఇవ్వనున్నారని సమాచారం. ఈ ఫోన్ లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
- Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉంటాయని మరొక రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
Vivo X100 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సీ, ఇన్ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
