Home News Vivo X100s గీక్‌బెంచ్, అంటుటు స్కోర్స్

Vivo X100s గీక్‌బెంచ్, అంటుటు స్కోర్స్

Highlights
  • త్వరలో Vivo X100s లాంచ్
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్
  • 23,05,267 అంటుటు స్కోర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన X100 సిరీస్ ను మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే Vivo X100s మరియు Vivo X100 Ultra ఫోన్లు ఈ సిరీస్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. తాజాగా Vivo X100s డివైజ్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే అంటుటు స్కోర్ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100s గీక్‌బెంచ్ మరియు అంటుటు స్కోర్స్

మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై వివో కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హన్ బాక్సీయావో Vivo X100s యొక్క అంటుటు మరియు గీక్‌బెంచ్ స్కోర్లను షేర్ చేశారు.

Vivo X100s స్మార్ట్‌ఫోన్ 2305267 పాయింట్లను అంటుటు పై స్కోర్ చేసింది.

సీపీయూ టెస్ట్ లో 538809 పాయింట్లు, జీపీయూ టెస్ట్ లో 940944 పాయింట్లు స్కోర్ చేసింది. మెమొరీ టెస్ట్ లో 472,337 పాయింట్లు స్కోర్ చేసింది. యూఎక్స్ టెస్ట్ లో 353,177 పాయింట్లు స్కోర్ చేసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Vivo X100s ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 2313 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7743 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Vivo X100s లో ఓఎల్ఈడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: Vivo X100s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

ఇతర ఫీచర్లు: Vivo X100s డివైజ్ ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు గతంలో వచ్చిన లీక్స్ ద్వారా తెలిసింది.