ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో X200 ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo X200 మరియు Vivo X200 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇంకా ఈ ఫోన్ల యొక్క అధికార లాంచ్ ప్రకటన రాలేదు. అయితే ఈలోపు ఓ లీక్‌స్టర్ ద్వారా Vivo X200 Pro యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo X200 Pro లీకైన వివరాలు
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo X200 Pro యొక్క వివరాలను మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేశారు.
లీక్ ప్రకారం, Vivo X200 Pro డివైజ్ మేజర్ అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6.7 లేదా 6.8 ఇంచుల సైజ్ ఉంటుందని సమాచారం.
Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ ప్రాసెసర్ అక్టోబర్ లో లాంచ్ అవుతుంది.
Vivo X200 Pro డివైజ్ సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు సమాచారం.
Vivo X200 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. 50ఎంపి సెన్సర్స్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
Vivo X100 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo X100 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ వినియోగించారు.
కెమెరా: Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
బ్యాటరీ: Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
ఓఎస్: Vivo X100 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo X100 Pro లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి..
కలర్ ఆప్షన్స్: Vivo X100 Pro బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
