సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Vivo X80 Pro+

హైలైట్స్:

  • వివో ఎక్స్ సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సెప్టెంబర్ లో ఈవెంట్ నిర్వహించనున్న వివో
  • ఈవెంట్ లో వివో ఎక్స్80 ప్రో+, వివో ఎక్స్80 లైట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో రానున్న వివో ఎక్స్80 ప్రో+

వివో తన ఎక్స్80 సిరీస్ ని ఎక్స్‌పాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివో నుంచి వివో ఎక్స్80 ప్రో+ డివైజ్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ విషయం గతంలో ఓ లీక్ ద్వారా తెలిసింది. తాజాగా, జీఎస్ఎం ఎరీనా వివో ఎక్స్80 సిరీస్ కు సంబంధించి కొంత సమాచారాన్ని వెలికి తీసింది. దీని ప్రకారం, సెప్టెంబర్ లో వివో ఎక్స్80 లైట్, వివో ఎక్స్80 ప్రో+ లాంచ్ కానున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ లో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 లైనప్ ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో అందరి అటెన్షన్ ను తమవైపుకి తిప్పుకోవాలని వివో ప్రో+ ఫోన్ ని సెప్టెంబర్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. వివో కి చెందిన ఫ్లాగ్ షిప్ లైనప్ లో వివో ఎక్స్80 ప్రో+ అత్యంత ఖరీదైన ఫోన్. 2022 రెండో త్రైమాసికంలో చైనా ప్రీమియమ్ ఫోన్స్ సెగ్మెంట్ లో యాపిల్ తర్వాత, రెండో స్థానంలో నిలిచేందుకు ఎక్స్80 సిరీస్ వివో కి ఎంతగానో ఉపయోగపడింది. దీన్ని బట్టి చైనాలో ఎక్స్80 సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పవచ్చు.

Vivo X80 Pro+ స్పెసిఫికేషన్స్, ధర (అంచనా)

వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో ఫోన్లు వరుసగా రూ.54,999, రూ.79,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వివో ఎక్స్80 ప్రో+ ధర మరింత అధికంగా ఉండే అవకాశముంది. అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో సూపర్ ప్రీమియమ్ ఫోన్ గా వివో ఎక్స్80 ప్రో+ రానుంది.

వివో ఎక్స్80 ప్రో+ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, ఓఐఎస్ తో కూడిన జీస్-ట్యూన్డ్ కెమెరాస్ ఉండనున్నాయి. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జెఎన్1, 50ఎంపి ఐసోసెల్ జెఎన్2 సెన్సర్లు ఉండనున్నాయి. వివో ఎక్స్80 ప్రో+ 200 వాట్ చార్జర్ లేదా 120 వాట్ చార్జర్ తో వచ్చే అవకాశముంది.

ఇటీవలె వివో ఎక్స్80 ప్రో ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందింది. దీంతో, రాబోవు వివో ఎక్స్80 ప్రో+ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశముంది. లేదంటే, లాంచ్ అయిన వెనువెంటనే అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇవి కాకుండా, ఇంకా ఈ ఫోన్ లో అమోలెడ్ ప్యానెల్ ఉండనుంది. వివో ఎక్స్80 ప్రో+ స్పెసిఫికేషన్స్ ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో వివో ఎక్స్80 ప్రో+ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరింత సమాచారం తెలిసే అవకాశముంది.

లేెటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఓటీటీ సమాచారం కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

Previous articleReliance AGM 2022 తేదీ ప్రకటన: Jio 5G లాంచ్ అయ్యే అవకాశం
Next articleభారత్ లో మొదటిసారి విక్రయానికి వచ్చిన Vivo V25 Pro: ధర, బ్యాంక్ ఆఫర్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.