Home News లాంచ్‌కి ముందు లీకైన Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

లాంచ్‌కి ముందు లీకైన Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

Highlights
  • ఫిబ్రవరి 3 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Vivo X90 Pro
  • 50 మెగాపిక్సెల్ సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోన్న Vivo X90 Pro
  • 2కే అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 Pro డివైజ్

ఫిబ్రవరి 3 న గ్లోబల్ గా Vivo X90 సిరీస్ లాంచ్ అవుతోంది. చైనాలో Vivo X90 సిరీస్ ని వివో సంస్థ గతేడాది లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లు ఉన్నాయి. Vivo X90 Pro, Vivo X90 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అవ్వనుండగా, Vivo X90 Pro+ మాత్రం కేవలం చైనాకే పరిమితమవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు Vivo X90 Pro యొక్క గ్లోబల్ వేరియంట్ కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo X90 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కి సంబంధించిన ఒక లీక్ ని షేర్ చేశాడు. ఓసారి Vivo X90 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ హై-ఎండ్ కెమెరా, ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో వస్తోంది. వచ్చే వారం ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్ కి ముందు పారస్ గుగ్లాని Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ యొక్క కెమెరా వివరాలను లీక్ చేశాడు. ఈ ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. దీంతో పాటు 50ఎంపి సోని ఐఎంఎక్స్758 పొట్రెయిట్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా సెన్సర్స్ ఉంటాయి. జైస్ భాగస్వామ్యంతో కలిసి కెమెరా విభాగాన్ని వివో తీర్చిదిద్దింది.

సర్క్యులర్ మాడ్యూల్ లో కనిపించే ట్రిపుల్ కెమెరా సెటప్ కి T* కోటింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వివో వీ2 చిప్ తో వస్తోంది. దీని వల్లన ల్యాగ్ లేని కెమెరా పనితనాన్ని అనుభూతి చెందవచ్చు. ఈ వివో ఫ్లాగ్షిప్ ఫోన్ ఫ్రంట్ కెమెరా 5 కొత్త పొట్రెయిట్ మోడ్ ఫిల్టర్స్ తో వస్తోంది. 4కే సూపర్ నైట్ మోడ్ వీడియో సపోర్ట్ కూడా ఈ ఫోన్ కి ఉంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. లెజెండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో ఫోన్ లాంచ్ కానుంది. Vivo X90 Pro ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుండటం విశేషం. ఇకపోతే ఈ ఫోన్ 9.34 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ భారీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తోంది. ఇది ఫోన్ హీట్ కాకుండా చూస్తుంది. పవర్ బ్యాకప్ కోసం Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. ఫోన్ బ్యాటరీ కేవలం 8 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ కర్వ్డ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్ 12జిబి ర్యామ్, 256జిబి మోడల్ ధర ఆర్ఎమ్ 5,299 (సుమారు రూ.1,01,700) గా ఉంటుందని అంచనా. భారత్ లో ధర ఇంకా తక్కువగా ఉండనుంది. Vivo X90 సిరీస్ భారత లాంచ్ పై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.