హైలైట్స్
- త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
- లైనప్ లో ఉండనున్న Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+
- లీకైన Vivo X90 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్, ప్రధాన ఆకర్షణగా నిలవనున్న 64 ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్
Vivo X90 సిరీస్ లాంచ్ ఖాయమైంది. కంపెనీ కూడా ఫోన్ కి సంబంధించిన వివరాలను టీజ్ చేయడం మొదలుపెట్టింది. Vivo X90 సిరీస్ లో మొత్తం 3 డివైజ్ లను లాంచ్ చేయాలని వివో నిర్ణయించింది. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. భారత మార్కెట్ లో వచ్చే ఏడాది Vivo X90 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని వివో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈలోపు Vivo X90 సిరీస్ కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ ఫోన్ డిజైన్ ని టీజ్ చేసింది. ఇప్పుడు Vivo X90 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. 64 ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ తో ఈ ఫోన్ వస్తుండటం విశేషం. ఓసారి Vivo X90 Pro+ యొక్క పూర్తి కెమెరా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.
Vivo X90 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్
Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్ ఎక్స్80 ప్రో కి సక్సెసర్ గా వస్తోంది. లాంచ్ కి ముందు Vivo X90 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్లో లీకైయ్యాయి. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ లీక్ చేసిన వివరాల ప్రకారం, Vivo X90 Pro+ 1-ఇంచ్ 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. ఇందులో సోని ఐఎంఎక్స్989 సెన్సర్ వాడారు. ఇదే సెన్సర్ ని షావోమి 12ఎస్ అల్ట్రాలో కూడా ఉపయోగించారు.
మెయిన్ కెమెరాతో పాటు, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు రెండు టెలీఫోటో లెన్సెస్ ఉండనున్నాయి. వీటిలో ఒకటి 50 ఎంపి టెలీఫోటో కెమెరా (2x ఆప్టికల్ జూమ్) కాగా, మరొకటి 64ఎంపి పెరిస్కోప్ కెమెరా. Vivo X90 సిరీస్ లో వివో 64ఎంపి ఒమ్నివిజన్ ఓవీ64బి టెలీఫోటో కెమెరా సెన్సర్ వాడనుంది. లో-లైట్, పొట్రెయిట్ మోడ్ పెర్ఫామెన్స్ ని మెరుగుపరిచేందుకు ఇందులో వీ2 కస్టమ్ ఐఎస్‌పి ఉండనుంది. అలాగే ఈ డివైజ్ జెయిస్ టీ* కోటింగ్ ని కలిగి ఉంటుంది.
ఇతర వివరాలను చూస్తే, Vivo X90 Pro+ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ని కలిగి ఉంటుంది. Vivo X90 Pro+ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడనున్నారు. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
వివో రెడ్ కలర్ ప్యానెల్ తో కూడిన మోడల్ ని టీజ్ చేసింది. ఫాక్స్ లెదర్ మెటీరియల్స్ తో తయారైన బ్యాక్ ప్యానెల్ మ్యాట్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది. Vivo X90 సిరీస్ లో ఓ మోడల్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోందని సమాచారం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












