హైలైట్స్
- నెట్టింట్లో ప్రత్యక్షమైన Vivo X90 Pro+ డిజైన్, స్పెసిఫికేషన్స్
- రెండర్స్ ద్వారా కనిపిస్తోన్న క్వాడ్ కెమెరాస్, జెయిస్ బ్రాండింగ్, డ్యూయల్-టోన్ ఫినిష్ వంటి ఫీచర్లు
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 1-ఇంచ్ సెన్సర్ తో వస్తున్న Vivo X90 Pro+
ఈ ఏడాది మొదట్లో Vivo X80 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Vivo X80, Vivo X80 Pro మోడల్స్ ఉన్నాయి. Vivo X80 డైమెన్సిటీ 9000 చిప్, Vivo X80 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వివో బ్రాండ్ Vivo X90 లైనప్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ బెన్ జెస్కిన్ Vivo X90 Pro+ యొక్క ఇమేజ్ ని షేర్ చేశాడు. ఈ ఇమేజ్ ద్వారా Vivo X90 Pro+ యొక్క రియర్ ప్యానెల్ డిజైన్ రివీల్ అయ్యింది.
స్టాండర్డ్ వర్షన్స్ Vivo X90, Vivo X90 Pro తో పాటు Vivo X90 Pro+ కూడా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో Vivo X90 సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ ఏడాది కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని పలు వార్తల ద్వారా తెలుస్తోంది.
vivo X90 Pro+ render based on leaks
Rumored specs include:
• 1-inch camera sensor
• Snapdragon 8 Gen 2
• 5,000mAh battery
• 100W fast charging#vivo #vivoX90 #vivoX90Pro #vivoX90ProPlus #vivoX90Series pic.twitter.com/BIeNpZhJrW— Ben Geskin (@BenGeskin) October 11, 2022
Vivo X90 Pro+ డిజైన్
Vivo X90 Pro+ యొక్క ఊహాజనితమైన డిజైన్ ని టిప్‌స్టర్ బెన్ జెస్కిన్ విడుదల చేశాడు. ఈ పిక్ ని బట్టి ఫోన్ రియర్ ప్యానెల్ Vivo X80 Pro ని పోలి ఉందని అర్థమవుతోంది. Vivo X90 Pro+ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ టోన్ ఫినిష్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, బాటమ్ లో వివో బ్రాండింగ్ కనిపిస్తున్నాయి. ఫోన్ గ్లాసీ డిజైన్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ లో నాలుగు కెమెరాలు కనిపిస్తున్నాయి. ఇవి జెయిస్ ఆప్టిక్స్ అని తెలుస్తోంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. చూస్తుంటే, వివో సంస్థ జెయిస్ తో తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని అర్థమవుతోంది. Vivo X90 Pro+ లో 1-ఇంచ్ సెన్సర్ ఉండనుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై క్లారిటీ లేదు. పెరిస్కోప్ లెన్స్ కటౌట్ కూడా కనిపిస్తోంది. ఇక మిగతా రెండు లెన్స్ లు పొట్రెయిట్ సెన్సర్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా అయ్యుండే అవకాశం ఉంది.
Vivo X90 Pro+ లో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉండనుందని జెస్కిన్ చెప్పాడు. ఈ చిప్ నవంబర్ 15 న జరిగే స్నాప్ డ్రాన్ ఈవెంట్ లో లాంచ్ అవుతోంది. ఇకపోతే Vivo X90 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, వీ1+ చిప్, 12జిబి వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 12/13 ఓఎస్ ఉండనున్నాయి. త్వరలోనే Vivo X90 Pro+ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.