
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ఈ ఏడాది ఏప్రిల్ లో X90 సిరీస్ ని లాంచ్ చేసింది. Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 9200 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఐపీ68 రేటింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Vivo X90 లైనప్ లో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా Vivo X90 Pro డివైజ్ ధరను కంపెనీ తగ్గించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo X90 Pro ధర తగ్గింపు
- భారత్ లో Vivo X90 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.84,999 ధరతో లాంచ్ అయ్యింది. తాజాగా Vivo X90 Pro డివైజ్ ధరను రూ.10,000 వరకు తగ్గించారు.
- ప్రస్తుతం భారత్ లో Vivo X90 Pro డివైజ్ ని రూ.74,999 కే కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 20 నుంచి అనగా నేటి నుంచి ఈ ఫోన్ కొత్త ధర అమలులో ఉంటుంది.
- ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
- రూ.10,000 క్యాష్‌బ్యాక్ లేదా ఎంపిక చేయబడిన బ్యాంక్స్ అందించే 24-నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం పొందవచ్చు.
- అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ద్వారా రూ.8,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇంకా వీ-షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Vivo X90 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo X90 Pro లో 6.78-ఇంచ్ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
- ఓఎస్: Vivo X90 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ప్రాసెసర్: ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 3.05 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
- మెమొరీ: 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.
- కెమెరా: Vivo X90 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.











