Home News లీకైన Vivo X90 Pro లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్

లీకైన Vivo X90 Pro లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

Vivo మే నెలలో వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ చైనా కంపెనీ తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. Vivo X90, Vivo X90 Pro ఫోన్లు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మొదట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ సిరీస్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తర్వాత భారత్ లో లాంచ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు వివో నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన ఎటువంటి అధికార ప్రకటన బయటకు రాలేదు.

అయితే, Vivo X90 Pro లాంచ్ కి ముందు, చైనీస్ టిప్ స్టర్ కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. ఈ హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని ఆ టిప్ స్టర్ చెప్పారు. మరి లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X90 Pro లాంచ్ తేదీ (అంచనా)

Vivo కంపెనీ X90 సిరీస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ఇంత వరకు వెల్లడించలేదు. అయితే, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ లాంచ్ తర్వాత, 2022 నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ సిరీస్ లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ నెలలో జరిగే స్నాప్ డ్రాగన్ టెక్ సమ్మిట్ లో 8 జెన్ 2 ప్రాసెసర్ లాంచ్ అవుతోంది. దీన్ని బట్టి, Vivo X90 సిరీస్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో చైనాలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X90 Pro ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని తాజాగా రివీల్ అయిన ఒక లీక్ ద్వారా స్పష్టమవుతోంది. టిప్ స్టర్ వెల్లడించిన దాన్ని బట్టి, ఈ ఫోన్లో ఎక్స్80 సిరీస్ కంటే భారీ బ్యాటరీ ఉండనుందట. ఎక్స్80 సిరీస్ 4700ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి, Vivo X90 సిరీస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, Vivo X90 Pro 1-ఇంచ్ కెమెరా లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియదు. కెమెరా సిస్టమ్ లో పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉంటుందని టిప్ స్టర్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. త్వరలోనే Vivo X90 Pro కచ్చితమైన లాంచ్ తేదీ, ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్, టెలీకామ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.