హైలైట్స్
- ఈ ఏడాది చివరికల్లా లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానున్న Vivo X90
- ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్, ప్రో, ప్రో ప్లస్ మోడల్స్
Vivo సంస్థ త్వరలో తన కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo X90 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చిప్ మేకర్ క్వాల్కమ్ కంపెనీ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని లాంచ్ చేసిన వెంటనే, Vivo X90 లాంచ్ ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే వివో మాత్రం మీడియాటెక్ ఫ్లాగ్షిప్ చిప్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ Vivo X90 సిరీస్ లో భాగం కానుంది.
లీకైన Vivo X90 లాంచ్ టైమ్, ప్రాసెసర్ పేరు
త్వరలో వివో నుంచి రాబోవు Vivo X90 సిరీస్ మీడియాటెక్ చిప్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Vivo X90 పోర్ట్‌ఫోలియో లో మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి: స్టాండర్డ్ వేరియంట్ Vivo X90, మిడ్-వేరియంట్ Vivo X90 Pro, హై-ఎండ్ మోడల్ Vivo X90 Pro+. క్వాల్కమ్ మరియు మీడియాటెక్ చిప్సెట్స్ ఈ సిరీస్ ఫోన్లలో ఉంటాయని ఇంతవరకు భావించారు.
చైనీస్ సామాజిక మాధ్యమం విబో పై WhyLabs చేసిన పోస్ట్ ప్రకారం, Vivo X90 లైనప్ కనీసం ఒక మోడల్ లోనైనా మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడనున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ నవంబర్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిప్సెట్ తో లాంచ్ అవుతోన్న తొలి సిరీస్ గా Vivo X90 నిలవబోతుంది. ఈ ఏడాది ఆఖర్లో Vivo X90 సిరీస్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. Vivo X90 సిరీస్ విశేషాలు ఏంటో చూద్దాం.
Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్ 1-ఇంచ్ ఇమేజ్ సెన్సర్ తో వస్తోంది. దీంతో ఈ సిరీస్ ఫోకస్ ప్రధానంగా కెమెరా విభాగంపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇక Vivo X90 Pro+ లో క్వాడ్ కెమెరాలు ఉండనున్నాయి. జెయిస్ లెన్సెస్ ని ఇందులో వాడారు. వివో సంస్థ జెయిస్ తో తన భాగస్వామ్యాన్ని ఇంకా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి పెరిస్కోప్ లెన్స్ ని కూడా అందిస్తున్నారు. మెయిన్ లెన్స్ తో పాటు, పొట్రెయిట్, అల్ట్రావైడ్ లెన్సెస్ ఉండనున్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. Vivo X90 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఇప్పటి వరకైతే Vivo X90, Vivo X90 Pro ఫోన్లు క్వాల్కమ్ చిప్ తో వస్తున్నట్లు భావించారు. మరి వివో నిర్ణయం ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













