హైలైట్స్
- ఇమేజింగ్ స్ట్రేటజీ కాన్ఫరెన్స్ లో Vivo X90 లాంచ్ తేదీని ప్రకటించనున్న వివో
- ఇదే సదస్సులో తాను సొంతంగా అభివృద్ధి పరిచిన ఇమేజింగ్ చిప్ ని అనౌన్స్ చేయనున్న వివో
- నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో Vivo X90 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

ఇటీవలె వివో కంపెనీ భారత్ లో Vivo X80 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X80, Vivo X80 Pro స్మార్ట్ ఫోన్స్ ఎంట్రీ ఇచ్చాయి. టాప్-నాచ్ కెమెరా పెర్ఫామెన్స్ అందించడంలో వివో తన పేనుని నిలపుకుంటోంది. ఐఫోన్, శాంసంగ్ ఎస్-సిరీస్ లతో కూడా వివో పోటీ పడుతోంది. ఇకపోతే త్వరలోనే వివో Vivo X90 సిరీస్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే కంపెనీ నుంచి ఈ సిరీస్ కు సంబంధించిన అధికార ప్రకటన ఇంతవరకు రాలేదు. అయితే, త్వరలోనే వివో నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వివో యొక్క ఈవెంట్ ఇన్విటేషన్ ప్రకారం, కంపెనీ అక్టోబర్ 24 న ఇమేజింగ్ స్ట్రేటజీ కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇదే సదస్సులో కంపెనీ తాను డెవలప్ చేసిన ఇమేజింగ్ చిప్ ని రివీల్ చేయనుంది. ఈ చిప్ పేరు వివో వీ2. ఇదే చిప్ ని Vivo X90 సిరీస్ లో వాడనున్నారు.
Vivo X70 సిరీస్ ని వీ1 చిప్ తో లాంచ్ చేసింది వివో. ఆ తర్వాత వీ1+ చిప్ తో Vivo X80 సిరీస్ లాంచ్ అయ్యింది. హై కంప్యూటింగ్ పవర్, లో టేటెన్సి, లో పవర్ కన్సంప్షన్ విషయాల్లో ఈ చిప్ ఉపకరించనుంది. లెజెండరీ కెమెరా ఎక్విప్మెంట్ మేకర్ జెయిస్ తో కలిసి కస్టమ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ని వివో డెవలప్ చేసింది. ఇది హై-లైట్ ట్రాన్స్మిషన్, అల్ట్రా-లో డిస్పర్షన్, థర్మల్ స్టెబిలిటీని అందించనుంది.
ఇదే ఈవెంట్ లో వివో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 యొక్క లాంచ్ తేదీని ప్రకటించనుంది. అయితే Vivo X90 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే Vivo X90 సిరీస్ కి సంబంధించిన వివరాలు లీక్స్ ద్వారా బయటకు వచ్చాయి.
Vivo X90 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు?
Vivo X90 సిరీస్ లైనప్ లో మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి: Vivo X90, X90 Pro, X90 Pro+. వీటిలో X90 Pro+ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం. మరికొన్ని కథనాల ప్రకారం, ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని తెలుస్తోంది. ఏది నిజమో లాంచ్ తర్వాతే తెలియనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 1-ఇంచ్ కెమెరా సెన్సర్ ని కలిగి ఉండనుంది. షావోమీ 12ఎస్ అల్ట్రా లో మనం ఈ సెన్సర్ ని చూశాం.
Vivo X90 సిరీస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఈ డివైజెస్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












