Home News గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు

గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు

హైలైట్స్

తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని చైనాలో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే Vivo X90 యొక్క ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

టిప్ స్టార్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Newzonly.com వెలువరించిన రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే Vivo X90 Pro+ మాత్రం గ్లోబల్ గా లాంచ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈసారి కేవలం Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ మాత్రమే గ్లోబల్ గా ఎంట్రీ ఇవ్వనున్నాయట.

సరే ఓసారి, Vivo X90 సిరీస్ యొక్క ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90 ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ

రిపోర్ట్ ప్రకారం Vivo X90 యొక్క స్టాండర్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.69,170) గా ఉంటుందని, Vivo X90 Pro ధర 5,299 యువాన్లు (సుమారు రూ.98,975) ఉంటుందని సమాచారం. స్టాండర్డ్ మోడల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: బ్రీజ్ బ్లూ మరియు ఆస్టరాయిడ్ బ్లాక్. మరోవైపు, Vivo X90 Pro లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నాయి.

Vivo X90 లాంచ్ తేదీ, లభ్యత

ఒక రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ 2023 జనవరి 31 న మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇక ఫిబ్రవరి 2 నుంచి సేల్ ప్రారంభం కానుంది. జనవరి 31 వ తేదీనే భారత్ లో కూడా Vivo X90 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నాయి. Vivo X90 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా 32ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నాయి.

Vivo X90 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానున్నాయి. వీటిలో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.