
Vivo X90 సిరీస్ గతేడాది చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడింట్లో X90, X90 Pro ఫోన్లు మాత్రమే గ్లోబల్ గా లాంచ్ అవుతున్నాయి. Vivo X90 Pro సోని ఐఎంఎక్స్989 50ఎంపి 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. అయితే వివో సంస్థ Vivo X90 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈలోపు గ్లోబల్ లాంచ్ తేదీకి సంబంధించి ఒక కొత్త లీక్ బయటకు వచ్చింది.
ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని తాజాగా Vivo X90 సిరీస్ యొక్క రిటైల్ బాక్స్ ఇమేజెస్ ని షేర్ చేశాడు. దీని ప్రకారం, జనవరి 27 నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఇంకా ఫిబ్రవరి 3 నుంచి వివిధ మార్కెట్స్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ ఫోన్ల లాంచ్ తేదీని వివో ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Vivo X90 స్పెసిఫికేషన్స్
Vivo X90 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. పంచ్-హోల్ తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo X90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ని కలిగి ఉంది.
గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో Immortalis-G715 GPU వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ LPPDDR5 RAM, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీపై పని చేస్తుంది. Vivo X90 5G లో 50MP Sony IMX866 ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఇంకా 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ (F/2.0), 12MP పొట్రెయిట్ లెన్స్ (F/1.98) తో కలిపి బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP (F/2.45) కెమెరా అందించారు.
Vivo X90 5G డ్యూయల్ మోడల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం USB Type-C 3.2 Gen1 తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.
Vivo X90 Pro స్పెసిఫికేషన్స్
Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడారు. Vivo X90 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo X90 Pro లో 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ మరియు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.
Vivo X90 Pro లో 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ సెన్సర్ (2x ఆప్టికల్ జూమ్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Vivo X90 Pro లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











