గత కొన్ని రోజులుగా Vivo X90 సిరీస్ కి సంబంధించిన లీక్స్ మరియు సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 26 న Vivo X90 Pro, Vivo X90 డివైజ్ లాంచ్ కానున్నాయని తాజాగా ఓ వార్త స్పష్టం చేసింది. అయితే వివో సంస్థ ఇంకా లాంచ్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈలోపు వివో తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Vivo X90 సిరీస్ ని టీజ్ చేసింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ కానుందని స్పష్టమైంది.
Vivo X90 సిరీస్ టీజర్ వీడియో చూడండి
The beauty of imagination is that it can turn the ordinary into something extraordinary.
Now it’s your turn to bring your imagination to life.#vivoX90Series revealing soon.To know more, visit https://t.co/W8bj8LfX81#XtremeImagination #ComingSoon pic.twitter.com/Sgdvc2JJL2
— vivo India (@Vivo_India) April 12, 2023
Vivo X90 టీజర్ వీడియో లో కనిపిస్తోన్న విధంగా త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. వీడియో చివర్లో కూడా కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు. ఈ టీజర్ లో కొన్ని పిక్స్ తో పాటు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి.
భారత్ కంటే ముందే ఈ దేశాల్లో లాంచైన Vivo X90 సిరీస్
గతేడాది నవంబర్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. తర్వాత Vivo X90, Vivo X90 Pro ఫోన్లు ఫిబ్రవరిలో మలేషియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. Vivo X90, Vivo X90 Pro డివైజెస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు.
Vivo X90, Vivo X90 Pro ధర (అంచనా)
Vivo X90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా MYR 3699 (సుమారు రూ.70,000) ధరతో లాంచ్ అయ్యింది. మరోవైపు Vivo X90 Pro డివైజ్ MYR 4999 (సుమారు రూ.95,000) తో లాంచైంది. భారత్ లో కూడా ఈ ఫోన్ల ధరలు ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.
Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
డిస్ప్లే, చిప్సెట్
- 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
- 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
- మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్
Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ వంటివి ఉంటాయి.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. Vivo X90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మరోవైపు Vivo X90 Pro ఒరిజిన్ఓఎస్ 3 పై పని చేస్తుంది. రెండు ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ సపోర్ట్ తో వస్తున్నాయి.
కెమెరా, బ్యాటరీ
- 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్
- 4870 ఎంఏహెచ్ బ్యాటరీ
Vivo X90 లో 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్ ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. రెండు ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి. Vivo X90 లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. Vivo X90 Pro లో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
