ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo X90s డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ ని వివో కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియర్ ప్యానెల్ డిజైన్ ని వివో రివీల్ చేసింది. దీని ద్వారా వైట్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. Vivo X90s డివైజ్ లో ఇతర ఎక్స్90 సిరీస్ డివైజెస్ లో మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంది. Vivo X90s ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది.
Vivo X90s డివైజ్ జీస్-ట్యూన్డ్ ఆప్టిక్స్ మరియు టీ* కోటింగ్ తో వస్తోంది. అయితే ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడో వివో ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఒక టిప్‌స్టర్ ద్వారా Vivo X90s స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చదవండి: గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!
Vivo X90s లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్
వివో సంస్థ Vivo X90s ఫ్లాగ్షిప్ లాంచ్ చైనాలో ఉండనుందని కన్ఫర్మ్ చేసింది. ఈ డివైజ్ చైనాలో త్వరలోనే లాంచ్ కానుంది. వివో ఇంకా గ్లోబల్ రిలీజ్ పై ప్రకటన చేయలేదు. అయితే Vivo X90s డివైజ్ ని రివీల్ చేసింది. దీంతో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ రివీల్ అయ్యింది. వైట్ రియర్ ప్యానెల్ గ్లాస్ బ్యాక్ తో కనిపిస్తోంది.
Vivo X90s కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే ఈ ఫోన్ జూన్ లో లాంచ్ కానుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. టిప్‌స్టర్స్ మరియు TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం.
Vivo X90s స్పెసిఫికేషన్స్ (లీక్స్)
- డిస్ప్లే: Vivo X90s లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 2800*1280 పిక్సెల్స్, కర్వ్డ్ స్క్రీన్, హోల్-పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo X90s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని సమాచారం. దీనికి తోడు వివో వీ2 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్పీ) చిప్ కూడా ఉండనుంది.
- కెమెరా: Vivo X90s డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo X90s స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4690 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇది కూడా చదవండి: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M34 5G
