Vivo కొత్త X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo X90S ను చైనాలో విడుదల చేసింది. X90 సిరీస్‌లో ఇది నాల్గవ డివైజ్. కంపెనీ ఇదివరకు Vivo X90, X90 Pro మరియు X90 Pro+ 5Gలను గత సంవత్సరం చైనాలో లాంచ్ చేసింది. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతే, కొత్తగా లాంచ్ చేసిన, Vivo X90S ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
డివైజ్ మధ్యలో ఒక పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది, ఇది సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు Wi-Fi 7 సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. X90S యొక్క ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Vivo X90s ధర, లభ్యత
సియన్, బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్స్ లో Vivo X90s స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ.45,353) గా ఉంది. మరోవైపు 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.48,755), CNY 4,699 (సుమారు రూ.53,300) గా ఉన్నాయి. జూన్ 30 వ తేదీ నుంచి చైనాలో ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Vivo X90S స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- డిస్ప్లే: Vivo X90S లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X90S డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Vivo X90S స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ తో కూడిన సోని ఐఎంఎక్స్633 లెన్స్ తో వచ్చింది.
- బ్యాటరీ: Vivo X90S డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో 5జీ, వై-ఫై 7, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్-లాక్ సపోర్ట్ ఉంటాయి.
